
‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంతో బుల్లితెరపై సందడి చేస్తున్న కింగ్ నాగార్జున త్వరలో ఈ కార్యక్రమానికి ముగింపు పలకనున్నారు. నాగార్జున తన మాటల గారడీతో ఈ కార్యక్రామానికి క్రేజ్ తీసుకొచ్చారు. టి.అర్.పి రేటింగ్ లలో దూసుకుపోతున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ సీజన్ – 1 చివరి దశకు చేరుకుంది. ఆగస్ట్ 7న ఈ కార్యక్రమం చివరి ఎపిసోడ్(40) ప్రసారం అవుతుంది.
అత్యంత ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ఈ కార్యక్రమం దిగ్విజయంగా 40 ఎపిసోడ్ లను పూర్తి చేసుకోబోతుంది. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ద్వారా ప్రేక్షకులతో నేరుగా కలిసే అవకాశం లభించింది. వ్యాఖ్యాతగా వ్యవహరించిన ప్రతి క్షణం ఎంతగానో ఎంజాయ్ చేశాను. నా మనసుకు దగ్గరైన కార్యక్రమం ఇది అని నాగార్జున అన్నారు.