“మేమ్ ఫేమస్” యూఎస్ వసూళ్లు ఇవే!

“మేమ్ ఫేమస్” యూఎస్ వసూళ్లు ఇవే!

Published on May 30, 2023 3:05 PM IST


ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ మరియు లహరి ఫిల్మ్స్ సంయుక్తంగా మేమ్ ఫేమస్ అనే హిట్ చిత్రాన్ని అందించాయి. నూతన దర్శకుడు సుమంత్ ప్రభాస్ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అతను ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ప్రేక్షకులని అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకు పోతుంది. ఈ చిత్రం యూఎస్ ప్రాంతం లో కూడా మంచి రెస్పాన్స్ తో దూసుకు పోతుంది.

సోమవారం ముగిసే నాటికి ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద 100కే డాలర్ల వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్ళను రాబట్టే అవకాశం ఉంది. ఈ చిత్రంలో సార్య, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సిరి రాసి, కిరణ్ మచ్చ, అంజి మామ, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, శివ నందన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కళ్యాణ్ నాయక్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు