డే 12 అదరగొట్టిన “మేమ్ ఫేమస్”.!

Published on Jun 7, 2023 3:56 pm IST


లేటెస్ట్ గా మన టాలీవుడ్ సినిమా దగ్గర వినూత్న ప్రమోషన్స్ తో అయితే రిలీజ్ కి వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం “మేమ్ ఫేమస్”. మరి యంగ్ నటుడు సుమంత్ ప్రభాస్ తానే హీరోగా అలాగే దర్శకునిగా చేసిన ఈ చిత్రం ఏకంగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి బిగ్గెస్ట్ స్టార్స్ నుంచి సూపర్ అప్లాజ్ అందుకోవడం మరింత బూస్టప్ గా మారింది.

ఇక అనేక మంది డెబ్యూ నటులు ఆర్టిస్ట్ లు తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు స్టేట్స్ లో అదిరే వసూళ్లు అందుకొని మంచి లాభాలు కూడా అందించి ఇంకా సాలిడ్ రన్ ని కొనసాగిస్తూ ఉండడం విశేషం. ఇక లేటెస్ట్ గా అయితే ఏకంగా డే 11 వసూళ్లు కన్నా డే 12 వసూళ్లే ఇంకా ఎక్కువ వచ్చినట్టుగా ఇపుడు తెలుస్తుంది. దీనితో అయితే ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి రన్ ని కొనసాగిస్తుందో మనం అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :