ఫన్, ఎంటర్టైన్మెంట్ అంశాలతో ఆకట్టుకుంటున్న ‘మేమ్ ఫేమస్’ ట్రైలర్

Published on May 17, 2023 10:16 pm IST

లహరి ఫిలింస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ సంస్థల పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు కలిసి నిర్మించిన రెండవ సినిమా మేమ్ ఫేమస్. ఈ సినిమాకి సుమంత్ ప్రభాస్ దర్శకత్వం వహించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాశి, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, కిరణ్ మచ్చ, అంజిమామ, శివ నందన్ సహా మొత్తం 35 మంది నూతన నటీనటులు నటించారు. ఇక ఈ సినిమా ఇప్పటికే అలరించే ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకి శ్యామ్ దూపాటి సినిమాటోగ్రాఫర్ గా, సృజన అడుసుమిల్లి ఎడిటర్ గా, అలానే అరవింద్ మౌళి ఆర్ట్ డైరెక్టర్ గా, కళ్యాణ్ నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసారు. కాగా నేడు ఈ సినిమా యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని హైదరాబాద్‌ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన ఈవెంట్ లో భాగంగా లాంచ్‌ చేసారు. నాచురల్‌ స్టార్‌ నాని ఈ ట్రైలర్ ని లాంచ్ చేసారు.

ఇక ఈ ట్రైలర్ లాంచింగ్ కి బుచ్చిబాబు సనా, శ్రీకాంత్ ఓదెల ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. గ్రామీణ నేపథ్యంలో ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే కథగా ఈ మూవీ సాగుతుందని మనకి ట్రైలర్ ని బట్టి అర్ధం అవుతుంది. ముగ్గురు స్నేహితులు తమ ఊళ్లో ఏ పని చేయకుండా తిరుగుతుండంతో వారి తల్లితండ్రుల చీవాట్లు పెడుతుంటారు. ఇక ఈ ముగ్గురికీ కూడా ఎవరి ప్రేమకథలు వారికి ఉంటాయి. కానీ వీరి ప్రవర్తన వలన పిల్లను ఇవ్వడానికి అమ్మాయిల పేరెంట్స్ ఇష్టపడరు. మరి దాని అనంతరం తమని తాము నిరూపించుకుని ఫేమస్ అవడానికి ఈ కుర్రాళ్లు ఏం చేశారనేది మిగతా కథ అని తెలుస్తోంది. కాగా ఈ ట్రైలర్ లో ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్, ఫన్నీ అంశాలు ఆకట్టుకున్నాయి. మొత్తంగా ప్రస్తుతం మేమ్ ఫేమస్ ట్రైలర్ యూట్యూబ్ లో మంచి ఆదరణ అందుకుంటోంది. కాగా ఈ నెల 26వ తేదీన ఈ సినిమా థియేటర్స్ లో విడుదలవుతోంది. ఈ మూవీని అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ వారు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :