సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ‘మేమ్ ఫేమస్’ ?

Published on May 22, 2023 6:00 pm IST


ఇటీవల రైటర్ పద్మభూషణ్ మూవీతో పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, లహరి ఫిలిమ్స్ సంస్థల పై తాజాగా నిర్మితం అయిన ఫుల్ ఎంటర్టైనర్ మూవీ మేమ్ ఫేమస్. సుమంత్ ప్రభాస్ నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని ఆకట్టుకోవడంతో పాటు సినిమాకు సంబంధించి చేస్తున్న ప్రమోషన్స్ కూడా అందరిలో మరింతగా సినిమా చూడాలనే ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ మూవీ మే 26న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.

అయితే తాజా టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ యొక్క సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి కాగా దీనికి సెన్సార్ వారు యు / ఏ సర్టిఫికెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. అలానే సినిమా యొక్క రన్ టైం 150 నిముషాలు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సారయ, మరియు సిరి రాసి ఇతర ప్రధాన తారాగణంగా అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ దీనిని నిర్మిస్తున్నారు. శ్యామ్ దూపాటి సినిమాటోగ్రఫీ, కళ్యాణ్ నాయక్ సంగీతం అందించిన ఈ మూవీ ఎంతర మేర ఆడియన్స్ ని అలరిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :