ట్విట్టర్ లో బన్నీ కొత్త లుక్ కి మెంటల్ మాస్ రెస్పాన్స్.!

Published on Jul 30, 2022 4:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన లాస్ట్ భారీ హిట్ చిత్రం “పుష్ప ది రైజ్” పాన్ ఇండియా లెవెల్లో కాస్త డౌట్ తోనే సెన్సేషన్ రీచ్ ని ప్రూవ్ చేసుకున్నాడు. దీనితో ఇక పుష్ప ది రూల్ కి నెక్స్ట్ లెవెల్లో అంచనాలు నెలకొల్పుకున్న బన్నీ ఇప్పుడు ఈ సీక్వెల్ షూట్ కి కాస్త గ్యాప్ లోనే ఉన్నా దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న ఓ యాడ్ నిమిత్తం ప్రిపేర్ చేసిన లుక్ రిలీజ్ చేసి సెన్సేషన్ ని రేపాడు.

స్టన్నింగ్ మేకోవర్ తో వచ్చిన ఈ లుక్ కి ట్విట్టర్ లో అయితే మన టాలీవుడ్ లో పలు ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా రాని రేంజ్ లో మాసివ్ రెస్పాన్స్ రావడం గమనార్హంగా మారింది. ఈరోజు ఉదయానికి 91 వేల లైక్స్ ఉన్న ఈ లుక్ 24 గంటలు కూడా పూర్తి కాకుండా ఏకంగా ఒక లక్ష 60 వేల లైక్స్ ని దాటేసింది.

ఇది మన టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియన్ సినిమా దగ్గర మాసివ్ రెస్పాన్స్ అని చెప్పాలి. ఇక దీనికే ఇలా ఉంటే నెక్స్ట్ పుష్ప 2 ఫస్ట్ లుక్స్ వాటికి అయితే ఇంకెలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఫైనల్ గా అయితే సోషల్ మీడియాలో తనకి తానే సాటి అని ఐకాన్ స్టార్ ప్రూవ్ చేసుకున్నాడు.

సంబంధిత సమాచారం :