ఇళయదళపతి విజయ్ 63 వ చిత్రాన్ని యువ దర్శకుడు అట్లీ తెరకెక్కించనున్నాడని తెలిసిందే. ఈచిత్ర షూటింగ్ వచ్చే ఏడాది జనవరి లో స్టార్ట్ కానుంది. ఇక గతంలో వీరిద్దరి కలయికలో తెరకెక్కిన ‘మెర్సల్’ చిత్రం బ్లాక్ బ్లాస్టర్ విజయం సాధించింది. దాంతో ఇప్పుడు ఈ చిత్రానికి కూడా అదే టీంను కొనసాగించనున్నారు.
ఇక విజయ్ నటించిన ‘సర్కార్’ విడుదలకు సిదంగా వుంది. ‘తుపాకి , కత్తి’ చిత్రాల తరువాత మురుగదాస్ -విజయ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంఫై తమిళ్ తోపాటు తెలుగులోను భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈచిత్రం నవంబర్ 6న విడుదలకానుంది.
