‘మీటర్’ తప్పకుండా అందరి అంచనాలు అందుకుంటుంది – హీరోయిన్ అతుల్య రవి

Published on Mar 29, 2023 3:02 am IST

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా ఇటీవల తెరకెక్కిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆయన హీరోగా తెరకెక్కిన మూవీ మీటర్. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ గా రూపొందిన ఈ మూవీని కొత్త దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహించగా క్లాప్ ఎంటర్‌ టైన్మెంట్ సంస్థ దీనిని భారీగా నిర్మించింది. ఇప్పటికే విడుదలైన మీటర్ టీజర్, పాటలకు అందరి నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. కాగా సమ్మర్ స్పెషల్‌ గా ఏప్రిల్ 7న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.

ఈ సందర్భంగా మీటర్ మూవీలో హీరోయిన్ గా నటించిన అతుల్య రవి నేడు మీడియా సమావేశంలో మూవీ అనుభవాలు పంచుకున్నారు. ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్ గా వుంటుంది. అబ్బాయిలు అంటే ఇష్టం లేని పాత్రలో కనిపిస్తాను, అలానే నా పాత్ర సీరియస్ గా వుంటుంది. కానీ అందులో నుంచే కామెడీ జనరేట్ అవుతుంది. నా పాత్ర ఫస్ట్ హాఫ్ లో చాలా కామెడీ వుంటుంది. కిరణ్ అబ్బవరంతో నా కాంబినేషన్ సన్నివేశాలు చాలా సరదాగా ఉన్నాయి. మరోవైపు మాస్ ఎమోషనల్ అంశాలు, ఫైట్స్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమాలో ఎమోషన్స్ చాలా బాగా వర్క్ అవుట్ అయ్యాయి. మొత్తంగా అన్ని అంశాలతో తెరకెక్కిన మీటర్ మూవీ తప్పకుండా అందరినీ ఆకట్టుకుని మంచి సక్సెస్ అవుతుందనే ఆశాభావాన్ని అతుల్య రవి వ్యక్తం చేసారు.

సంబంధిత సమాచారం :