100 మిలియన్ల వ్యూస్ దక్కించుకున్న ‘మగధీర’ !
Published on Jul 2, 2017 3:31 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ‘మగధీర’ చిత్రం 2009 లో విడుదలై ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పని లేదు. ఈ సినిమాతో చరణ్ పరిపూర్ణమైన స్టార్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకోగా దర్శకుడు రాజమౌళి టాప్ దర్శకుడిగా నిలిచిపోయారు. కలెక్షన్ల పరంగా కూడా టాలీవుడ్ కి సరికొత్త లెక్కల్ని నేర్పించిన ఈ సినిమా యొక్క హిందీ వెర్షన్ ఇప్పుడో భారీ రికార్డును సొంతం చేసుకుంది.

2016 ఫిబ్రవరిలో యూట్యూబ్ లో విడుదలైన ఈ హిందీ వెర్షన్ 100 మిలియన్ల వ్యూస్ దాటింది. ఇప్పటికి వరకూ ఈ సినిమాకు 100,134,308 వ్యూస్, 1,42,860 లైక్స్ దక్కాయి. ఒక సౌత్ ఇండియన్ సినిమా యొక్క హిందీ వెర్షన్ ఈ స్థాయిలో వ్యూస్ రాబట్టుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ‘బాహుబలి-2’ గా పేరు పెట్టిన ఈ వెర్షన్ ను గోల్డ్ మైన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మనీష్ సాహా విడుదల చేశారు. ఈ ఫీట్ తో దక్షిణాది సినిమా స్టామినా ఏమిటో మరోసారి రుజువైనట్లైంది.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook