లైగర్ చిత్రం నుండి ఓ రేంజ్ అనౌన్స్ మెంట్…”మైక్ టైసన్” కీలక పాత్రలో!

Published on Sep 27, 2021 5:15 pm IST

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ అంటూ దానికి క్యాప్షన్ ఇచ్చి సినిమా పై మొదటి నుండే అంచనాలు పెంచేశారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే భారీ హైప్స్ క్రియేట్ అయ్యాయి. అనుకున్న విధంగా ఈ పాన్ ఇండియా మూవీ లోకి బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే నిన్న ఈ చిత్రం కి సంబంధించిన ప్రకటన చేసిన లైగర్ టీమ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది.

అమెరికన్ లెజెండరీ బాక్సర్ అయిన మైక్ టైసన్ ఈ చిత్రం లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మొదటి సారి గా ఇండియన్ స్క్రీన్ పై ఈ రియల్ హీరో నటిస్తుండటం విశేషం. అయితే ఇప్పుడే మొదలైంది అంటూ చిత్ర యూనిట్ చెప్పుకు రావడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం గోవా లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :