మరోసారి మెగాస్టార్ సరసన మిల్కీ బ్యూటీ..?

Published on Sep 24, 2021 7:03 am IST


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా పలు సాలిడ్ ప్రాజెక్ట్ లు తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి వాటిలో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య” కంప్లీట్ కూడా అయ్యింది. మరి వీటి తర్వాత రెండు రీమేక్ సినిమాలు చిరు చేయనుండగా వాటిలో “గాడ్ ఫాథర్” చిత్రాకరణలో ఉంది. మరి దీనితో పాటుగా మరో రీమేక్ “భోళా శంకర్” సినిమాని కూడా చిరు చేస్తుండగా ఇప్పుడు దీనిపై సరికొత్త బజ్ వినిపిస్తుంది.

ఈ సినిమాకి గాను దర్శకుడు మెహర్ మిల్కీ బ్యూటీ తమన్నా ను ఫిక్స్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. మరి ఇదే నిజం అయితే చిరు సరసన తమన్నా కి ఇది రెండో సినిమా అని చెప్పాలి. ఇది వరకే వీరి జోడి సైరా లో ఆకట్టుకుంది. ఇక అలాగే భోళా శంకర్ లో కీర్తి సురేష్ చిరుకి సోదరి పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. మరి హీరోయిన్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది..

సంబంధిత సమాచారం :