మిలియన్ మార్కును అందుకున్న ‘ఫిదా’ !


మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘ఫిదా’. దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా కాలం తర్వాత డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. పైగా నిన్న విడుదలైన చిత్ర టీజర్ కూడా విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ క్రేజ్ మరింతగా పెరిగింది. పూర్తిగా 24 గంటలు కూడా గడవకముందే ఈ టీజర్ మిలియన్ వ్యూస్ ను అందుకోవడం విశేషం.

వరుణ్ తేజ్ సరసన ‘ప్రేమమ్’ ఫేమ్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆమెకు తెలుగులో డెబ్యూ సినిమా కావడం కూడా సినిమా పట్ల ప్రేక్షకులు ఆసక్తి చూపడానికి మరొక ప్రధాన కారణంగా నిలిచింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం యొక్క విడుదల తేదీని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఇకపొతే వరుణ్ తేజ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో కొత్త సినిమాని నిన్న మొదలుపెట్టారు. ఎస్వీవీ బ్యానర్ నిర్మించనున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించనుంది.

టీజర్ కోసం క్లిక్ చేయండి: