జపాన్లో “RRR” కి మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.!

జపాన్లో “RRR” కి మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.!

Published on Nov 27, 2022 1:00 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియా సినిమా ఇప్పుడు గ్లోబల్ గా కూడా ఎంతటి రీచ్ ని అందుకుంటుందో చూస్తున్నాం. ఇక రీసెంట్ గానే జపాన్ లో రిలీజ్ కాబడిన ఈ చిత్రం ఫాస్టెస్ట్ గ్రాసర్ గా భారీ వసూళ్లతో అదరగొడుతుండగా ఇంకా సెన్సేషనల్ రెస్పాన్స్ ని ఈ చిత్రం అక్కడ కొనసాగుతుండగా లేటెస్ట్ గా అయితే అక్కడ సినిమా అందుకున్న ఓ మ్యాజికల్ మూమెంట్ ని అయితే చిత్ర యూనిట్ ఇప్పుడు షేర్ చేసుకున్నారు.

“గాల్లోకి పేపర్ లు ఎగరేస్తే స్క్రీన్ కనిపించకూడదు అని ప్రతి ఫ్యాన్ డమ్ ఫీల్ అవుతారు. కానీ అది ఎన్టీఆర్, రామ్ చరణ్ ల సినిమా నిజం చేస్తుంది అని ఎవరు ఊహిస్తారు? అని జపాన్ లో RRR సినిమాకి వచ్చిన సెన్సేషనల్ రెస్పాన్స్ స్నాప్ తో పోస్ట్ చేశారు. దీనితో అయితే ఆ పిక్ చూస్తే జపాన్ లో ఈ చిత్రానికి మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్ ని ఈ చిత్రం అందుకుందని చెప్పడంలో సందేహమే లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు