లేటెస్ట్ : SSMB 28 ప్రీ రిలీజ్ బిజినెస్ పై మైండ్ బ్లోయింగ్ బజ్

Published on Feb 3, 2023 11:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబుతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం SSMB 28 వర్కింగ్ టైటిల్ తో ఒక మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన అతడు, ఖలేజా మూవీస్ రెండూ కూడా కల్ట్ క్లాసిక్స్ గా నిలిచి ఆడియన్స్, సూపర్ ఫ్యాన్స్ లో ఇప్పటికీ కూడా మంచి క్రేజ్ ని కలిగి ఉన్నాయి.

ఇక ఆ రెండు సినిమాల తరువాత వీరు మళ్ళి పన్నెండేళ్ల విరామం అనంతరం వర్క్ చేస్తుండడంతో పాటు అటు మహేష్ బాబు, ఇటు త్రివిక్రమ్ ఇద్దరూ కూడా వరుసగా సూపర్ హిట్స్ కొడుతూ కెరీర్ పరంగా దూసుకెళ్తుండడంతో SSMB 28 మూవీ పై అందరిలో ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడ్డాయి.

పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ వారు ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ యొక్క ఓటిటి రైట్స్ ని ఇప్పటికే ప్రముఖ ఓటిటి సంస్థ ఏకంగా రూ. 80 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

అలానే ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ కి సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్ టాలీవుడ్ లో క్రేజీ బజ్ గా మారింది. కాగా ఈ మూవీ యొక్క థియేట్రికల్ రైట్స్ ని అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 150 కోట్ల వరకు పలుకుతుండగా ఒటిటి, డబ్బింగ్, ఆడియో వంటి నాన్ థియేట్రికల్ రైట్స్ కి కూడా రూ. 150 కోట్ల వరకు బిజినెస్ జరుగనుందని, మొత్తంగా ఈ మూవీ ఏకంగా రూ. 300 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోనున్నట్లు చెప్తున్నారు. అయితే పక్కాగా SSMB 28 మూవీ యొక్క పూర్తి ప్రీ రిలీజ్ డీటెయిల్స్ కి సంబంధించి అఫీషియల్ గా న్యూస్ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :