“భీమ్లా నాయక్” యూనిట్ పై కేటీఆర్ లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

Published on Feb 24, 2022 9:04 am IST

నిన్ననే టాలీవుడ్ లో ఒక క్రేజీయెస్ట్ మల్టీ స్టారర్స్ లో ఒకటైన భారీ చిత్రం “భీమ్లా నాయక్” సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు నటించిన ఈ మాస్ ఎంటర్టైనర్ తాలూకా ప్రీ రిలీజ్ వేడుక తెలంగాణా రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరుల సమక్షంలో ఎంతో అట్టహాసంగా జరిగింది.

మరి ఈ వేడుకలో మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ కానీ చిత్ర యూనిట్ కి తెలిపిన శుభాకాంక్షలు కానీ సినిమా వేడుకలో మరింత ఆకర్షణగా నిలిచాయి. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ ఒక లేటెస్ట్ ఆసక్తికర పోస్ట్ ని తన సోషల్ మీడియా ద్వారా వేయడం జరిగింది.

నా రొటీన్ లైఫ్ నుంచి కొంచెం బ్రేక్ ఇచ్చి భీమ్లా నాయక్ చిత్ర బృందం నా సోదరులు పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మరియు దర్శకుడు సాగర్ చంద్ర మరియు సంగీత దర్శకుడు థమన్ లకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అలాగే అత్యున్నత సంగీత కళాకారులు అయినటువంటి మొగులయ్య గారిని శివమణి గారిని కలవడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది అని ఈవెంట్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసి తాను తెలియజేసారు. దీనితో ఈ లేటెస్ట్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :