కాణిపాకం ఇ.ఓ.వెంకటేష్ కు, ప్రముఖ రచయిత శ్రీనివాస్ కు మంత్రి పెద్దిరెడ్డి అభినందనలు

Published on Sep 21, 2021 5:00 pm IST

తిరుపతి : సెప్టెంబర్ : 21

విభిన్న సంస్కృతుల ఈ విశాల దేశంలో సామాజిక మాధ్యమాలు ఎంతగా విస్తరిస్తున్నా … మానవ జీవన భవిష్యత్తుకు భరోసా ఇచ్ఛేది కేవలం భక్తి మాత్రమేనని , ఇంతటి మహానాగరికతలో కూడా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ గ్రంధాలకు డిమాండ్ నానాటికీ పెరగడానికి ఆయన అద్భుతమైన పవిత్రమైన భాషతో కూడిన నిస్వార్ధ సేవేనని ఆంద్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

కాణిపాకం శ్రీవరసిద్ధివినాయక దేవస్థానంలో అపురూపంగా జరుగుతున్న శ్రీ గణపతి ఉత్సవాలలో పాల్గొన్న పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి దంపతులకు కాణిపాకం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ. వెంకటేష్ పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలమైన పరమాద్భుతగ్రంధం ‘ నిన్నే సేవింతున్’ ప్రతులను అందజేశారు. ఈ గ్రంధాలను మంత్రి పెద్దిరెడ్డి ప్రత్యేకంగా పరిశీలించి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఉత్సవాల ముగింపు రోజున ప్రత్యేక ఆహ్వానితురాలిగా పాల్గొన్న సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారిణి, ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ కమీషనర్ డాక్టర్ శ్రీమతి వాణీ మోహన్ కు కూడా పురాణపండ శ్రీనివాస్ మహాగ్రంథాలనే జ్ఞాపికలుగా బహుకరించడం పట్ల ….ఈ భక్తిరసాత్మక పారవశ్యపు గ్రంధాల వైభవాన్నిభక్తులకు అందిస్తున్న కాణిపాకం కార్యనిర్వహణాధికారి ఏ . వెంకటేష్ ను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.

మరోప్రక్క నగరి ఎమ్మెల్యే రోజా కూడా తన ఇంట జరిగిన గణపతి ఉత్సవానికి విచ్ఛేసిన అతిధులకు సైతం తన మిత్రులైన పురాణపండ శ్రీనివాస్ గ్రంధాలనే బహూకరించడం మరొక విశేషంగానే చెప్పాలి. అంతేకాకుండా తన పూజలో కూడా పురాణపండ గ్రంధాలనే పారాయణం చెయ్యడం మరొక భక్తి విశేషం. చాలా కాలంగా రోజాకు పురాణపండ శ్రీనివాస్ కు మైత్రీ బాంధవ్యం ఉండటంవల్ల రోజా చేపట్టే ప్రతీ భక్తి కార్యానికి శ్రీనివాస్ బుక్స్ నే ఆమె జ్ఞాపికలుగా బహూకరిస్తారని విజయవాడ, నగరి, రాజకీయ మరియు ఆత్మీయ బంధువులకు తెలుసున్న విషయమే. ఈ బుక్స్ అద్భుతంగా వుంటాయని రాష్ట్రంలో కాకలుతీరిన సాహితీ యోధులకు కూడా ఎరుకే.

ఏది ఏమైనా గత కొన్ని సంవత్సరాలుగా దేశవిదేశాలలో తెలుగు లోగిళ్ళకు చాలా మేలిమి విలువలతో కూడైన అద్భుత రమణీయ గ్రంధాలను రచించి, సంకలనీకరించి అందిస్తున్న పురాణపండ శ్రీనివాస్ గ్రంధాలకు తెలుగు రాష్ట్రాలలో వున్న వందల దేవస్థానాలలో వున్నా డిమాండ్ అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఇది కన్నులముందు కనిపిస్తున్న సత్యం.

అయితే … ఈ సంవత్సరం కాణిపాకం దేవస్థానానికి విచ్ఛేసి అతిధులకు ఈ అపురూపపు శోభల పవిత్ర గ్రంధాలు అందించడంలో కార్యనిర్వహణానిధికారి వెంకటేష్ వెనుక పవిత్రమైన కీలకపాత్ర కాణిపాకం దేవస్థానం ఎ.ఇ.ఓ కృష్ణారెడ్డిదేనని పలువురు దేవాదాయ శాఖ అధికారులు అభినందనలు వర్షిస్తున్నారు. శ్రీశైల దేవస్థానం వంటి అనేక మహా పుణ్యక్షేత్రాలలో ఉన్నతాధికారిగా పనిచేసి వందల మంది అధికారుల మన్ననలు పొందిన ఇప్పటి కాణిపాకం దేవస్థానం ఎ.ఇ.ఓ కృష్ణారెడ్డి మాట్లాడుతూ కాణిపాకం దేవస్థానం డిప్యూటీ కలెక్టర్ మరియు కార్యనిర్వహణాధికారి అయిన వెంకటేష్ గారు ఎంతో పవిత్ర సంస్కారహృదయం కలిగిన వారని, ఆయన ఒక యజ్ఞ భావనతో ఈ గ్రంథ వైభవాన్ని అందరికీ అందించడం పట్ల అన్ని వర్గాలవారు మా కార్యనిర్వహణాధికారి సమర్ధతను ప్రశంసించడం మా సిబ్బంది అందరికి ఆనందం కలిగిస్తోందని చెప్పారు.

అనేక గణపతులతో , అనేక స్తోత్ర మంత్ర తంత్ర యంత్ర వైభవాలతో అలరారుతున్న ఈ మహాగణపతి విశేష గ్రంధానికి ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘ వారాహి చలన చిత్రం ‘ అధినేతలు సాయి కొర్రపాటి , రజని కొర్రపాటి దంపతులు సమర్పకులుగా వ్యవహరించారు. తొలిప్రతిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ సుబ్బారెడ్డి దమ్పతులు స్వీకరించి పురాణపండ శ్రీనివాస్ విలక్షణ చైతన్య భక్తిరసాత్మక రచనావైదుష్యాన్ని, అసాధారణ సేవను పరశింసించారు. కాణిపాకం దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెంకటేష్ చేస్తున్న మహోన్నత విలువల గ్రంథ చైతన్య పంపిణీని అధికారులు, అనధికారులు, భక్త బృందాలు ప్రశంసలతో ముంచెత్తున్నాయి. తెరవెనుక పాత్రధారి ఏ.ఇ.ఓ.కృష్ణారెడ్డి కృషిని అందరూ హృదయంతో అభినందిస్తుండటం మన కనులముందు కనిపిస్తున్న సత్యం.

సంబంధిత సమాచారం :