ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పై సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. టికెట్ ధరల తగ్గింపు విషయం లో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తో భేటీ అనంతరం సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
వ్యక్తుల అభిప్రాయాలను సంతృప్తి పరచడం కష్ట సాధ్యం, మేము లాజిక్ లు చెబితే ఎదుటి వారికి కష్టం కలుగుతుంది అని, తమ ప్రభుత్వం వచ్చాక ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు అని అన్నారు. సినిమాటోగ్రఫి నిబంధనల మేరకు రేటు నిర్ణయించాం అని, 2013 లో జీవో నెంబర్ 100 తో పోల్చితే ధరలు పెంచే ఇచ్చాం అంటూ చెప్పుకొచ్చారు. అయితే టికెట్ ధరల తగ్గింపు విషయం లో ఎవరికైనా సహేతుకంగా అనిపిస్తే నేరుగా వచ్చి, కమిటీ కి చెప్పవచ్చు, వర్మగారు ఇచ్చినట్లే ఎవరు సలహాలు ఇచ్చినా తీసుకుంటాం అని అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యం లో 50 శాతం ఆక్యూపెన్సీ నిబంధన ను విధించిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వ నిర్ణయం ఇబ్బంది ఉంటే సినిమాను వాయిదా వేసుకోవచ్చు అని, అందుకే కదా ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ వాయిదా వేసుకున్నారు అని అన్నారు. మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమ లో చర్చాంశనీయంగా మారాయి.