ఏపీలో టికెట్, థియేటర్ సమస్యలపై ఓపన్ అయ్యిన మంత్రి పేర్ని నాని.!

Published on Dec 28, 2021 8:37 pm IST

గత కొన్నాళ్ల నుంచి కూడా ఏపీలో థియేటర్స్ మరియు టికెట్ ధరలకు సంబంధించి ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలిసిందే. కరోనా తర్వాత మళ్ళీ ఆ నష్టాలు చాలవు అన్నట్టుగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త జీవో లతో వారు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనితో టాలీవుడ్ కి మరియు ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తునే వాగ్వాదాలు నడిచాయి.

మధ్యలో ఎన్నో సార్లు కీలక భేటీలు, చర్చలు కూడా జరిగాయి అయినా కూడా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. కానీ ఇప్పుడు ఫైనల్ గా ఈ సమస్యకి తుది తీర్పులా ఏపీ సినిమా మంత్రి పేర్ని నాని పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ టికెట్ ధరలకు సంబంధించి హై కోర్టు ఆదేశాల మేరకు ఒక కమిటీని నియమించామని దానితో తొందరలోనే ధరల విషయంలో ఒక క్లారిటీ ఇస్తామని హామీ ఇస్తామని తెలిపారు.

అలాగే థియేటర్స్ సమస్యపై మాట్లాడుతూ అనేక థియేటర్స్ వారిని రూల్స్ పాటించని వారికి ఎగ్జిబిటర్లు అనుమతులు లేకుండా కొన్ని థియేటర్లు నడిపారని అలాగే మరికొంత మంది కూడా కొన్ని నియమాలు పాటించకుండా నడిపారని వారిలో మరికొంత మంది స్వతహాగా మూశారని సూచించారు. వీటి అన్నిటి పైన సమగ్రంగా ఒక క్లారిటీ త్వరలోనే తెలియజేస్తామని సానుకూలంగా స్పందించారు.

సంబంధిత సమాచారం :