మంత్రి రోజా సమర్పించిన మంత్రపేటికకు తిరుమల అర్చకుల ప్రశంస

Published on May 16, 2022 12:03 pm IST

ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ శోభాయమాన రచన ఆవిష్కరణ .

తిరుపతి : మే : 16

భారతీయ తత్వశాస్త్ర మూలాలున్న కధలు కొన్ని మనకి దర్శనమిస్తాయి. అలాంటి వాటిల్లో భాగవతంలోని నారసింహ అవతార ఆవిర్భావ అద్భుత ఘట్టాన్ని ఎంచుకుని మరీ ఒక అమోఘమైన గ్రంధాన్ని ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహా దారులు పురాణపండ శ్రీనివాస్ విలక్షణ శైలిలో అపురూపంగా అందింపచేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా .

ఈ వైశాఖమాసంలో వచ్చే విశిష్ట మహాపర్వ దినాల్లో ఒకటైన శ్రీ నరసింహ జయంతి జయంతి మంగళ వేళలో నగరిలో జరిగిన ఒక ఉత్సవంలో మంత్ర స్తోత్రాలతో కూడిన మహానరసింహుని కథతో రూపుదిద్దుకున్న ‘ యుగే యుగే ‘ ప్రత్యేక సంచికను ఆవిష్కరించి … తానే స్వయంగా కొందరికి భక్తినిండిన హృదయంతో పంచడం విశేషంగానే చెప్పాలి.

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ దైవబలంవల్లనే మనం అనుగ్రహీతులమవుతున్నామని , అపారదయామయుడైన వేంకటేశ్వరుని దశావతారాల్లో పరమాద్భుత మహా అవతారస్వరూపంగా నృసింహ ఆవిర్భావం కనిపిస్తుందని పేర్కొన్నారు.

మహాబలాలకే మహాబలాన్నిచ్చే నృసింహ భగవానుని దివ్య గ్రంధాన్ని సమర్పించే భాగ్యం నాకు కలగడం శ్రీవేంకటేశ్వరుని సమగ్ర అనుగ్రహంగా భావిస్తున్నట్లు రోజా చెప్పారు.

గత రెండేళ్లనాడు పరమరమణీయగ్రంధంగా పండితపామరులచే వేనోళ్ళ కొనియాడబడ్డ పురాణపండ శ్రీనివాస్ రచనాసంకలన అమృతకలశం ” శ్రీపూర్ణిమ ‘ అఖండ గ్రంధాన్ని కూడా రోజా ఎందరో ప్రముఖులకు సమర్పించి ప్రశంసలు పొందిన విషయం కూడా రసజ్ఞులకు ఎరుకే. శ్రీపూర్ణిమ దివ్య గ్రంధం చేసిన పవిత్ర సంచలనం అంతా ఇంతా కాదు.

వేంకటాచలక్షేత్ర ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు సైతం రోజా ఆధ్యాత్మిక సేవను అభినందించడం మరొక విశేషంగా చెప్పక తప్పదు.

ఇటు మంత్రిగా అనేకానేక ప్రయోగాత్మక ప్రభుత్వ కార్యక్రమాలలో చాలా ఉత్సాహంగా పాల్గొంటూ, ఇటు జీవితాన్ని చరితార్థం చేసే ఇలాంటి భక్తి రసాత్మక కార్యక్రమాలను నిర్మాణాత్మకంగా చేసి ఆదర్శత్వాన్ని నిరూపించారు రోజా.

తెలుగు లోగిళ్ళలో పురాణపండ శ్రీనివాస్ బుక్స్ నాణ్యతా ప్రమాణాలే ప్రత్యేకంగా వుంటాయని, నిస్వార్ధంగా చేయడంలో, అద్భుతంగా దైవీయ గ్రంధాలు అందించడంలో శ్రీనివాస్ కృషి అసాధారణమని , అపురూపమైన ఆయన శైలికి ఎంతోమంది సాహిత్య వేత్తలే ఆశ్చర్యపోతుంటారని ఏడేళ్లనాడు ఆచార్య సి. నారాయణరెడ్డి హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఒక గ్రంథావిష్కరణ సభలో పలుకులు నిజమని చెప్పి తీరాల్సిందే.

రోజమ్మ సమర్పించిన ఈ అపురూపమైన నృసింహ గ్రంధంలో 19 పేజీ నుండి 37 వరకు వున్నా నారసింహుని అవతార ఘట్టాన్ని శ్రీనివాస్ ఎంత అందంగా రాసారో అని తిరుమల వేదపాఠశాల విద్యార్థులు అభినందనలు వర్షిస్తున్నారు. ఇంతటి ఉత్తమ గ్రంధం సమర్పించిన రోజమ్మ మనస్సు ఎంతటి ఉన్నతమైనదో కదా. ఈ పుస్తకాన్ని ప్రతీ పేజీ ప్రశాంతంగా చూసిన వారెవరైనా సరే … పర్యాటక మంత్రి రోజమ్మా…! పదితరాలు వర్ధిల్లమ్మా ..!! అని తీరాల్సిందే. నో డౌట్ .

ఎప్పటిలానే పురాణపండ శ్రీనివాస్ తన గ్రంధాల ఆవిష్కరణకు తాను హాజరు కాలేదు.
కొన్నేళ్లుగా అద్భుత గ్రంధాలను నిస్వార్ధంగా అందిస్తున్న పురాణపండ శ్రీనివాస్ సమావేశాలకు, సభలకు, గ్రంథావిష్కరణకు చాలా దూరంగా వుంటున్నారు.

సంబంధిత సమాచారం :