బొమ్మల రామారం టీమ్‌కు మంత్రి తలసాని అభినందన

BOMMALA.
మేడియవాల్‌ స్టోరీ టెల్లర్స్‌ సమర్పణలో సూరి, రూపారెడ్డి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘బొమ్మల రామారం’. నిషాంత్‌ దర్శకత్వంలో పుదారి అరుణ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగ‌స్ట్ 12న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర‌ర్భంగా చిత్ర‌యూనిట్‌ను తెలంగాణ సినిమాటోగ్రాఫీ మినిష్ట‌ర్ తల‌సాని శ్రీనివాస‌యాద‌వ్ అభినందించారు. ఈ సందర్భంగా…

మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ “యువ‌ద‌ర్శ‌కుడు నిషాంత్ రూపొందించిన బొమ్మ‌ల రామారం చిత్రంతో 40 మంది నూత‌న న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్‌తో ప‌రిచ‌యం అవుతున్నారు. అందుకు త‌న‌ను అభినందిస్తున్నాను. ఆగ‌స్ట్ 12న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. కొత్త‌వాళ్ళు చాలా మంది ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్నారు. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు, ఇందులో న‌టించిన న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. త‌ప్ప‌కుండా ఈ సినిమా చాలా బావుంటుంది. పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని కోరుకుంటూ యూనిట్‌ను మ‌న‌స్ఫూర్తిగా అభినంద‌న‌లు“ అన్నారు.