“మిన్నల్ మురళి” హవా మామూలుగా లేదుగా!

Published on Dec 29, 2021 5:20 pm IST

తోవినో థామస్, గురు సోమ సుందరం ప్రధాన పాత్రల్లో బసిల్ జోసెఫ్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం మిన్నల్ మురళి. సూపర్ హీరో ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ చిత్రం పలు మార్లు వాయిదా పడి, డిసెంబర్ 24 వ తేదీన నెట్ ఫ్లిక్స్ ద్వారా డైరెక్ట్ డిజిటల్ గా విడుదల అయ్యింది. ఈ చిత్రం మలయాళం లో మాత్రమే కాకుండా, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ బాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది.

మిన్నల్ మురళి చిత్రం ఒక మైల్ స్టోన్ ను చేరుకోవడం జరిగింది. గ్లోబల్ టాప్ 10 నాన్ ఇంగ్లీష్ చిత్రాల్లో ఈ చిత్రం నాల్గవ స్థానం లో నిలిచింది. అంతేకాక మిగతా 11 దేశాల్లో టాప్ 10 లో నిలవడం విశేషం. ఇండియా, ఒమన్, ఖతార్, యూ ఏ ఈ లో టాప్ లో దూసుకు పోతుంది. ఈ చిత్రం కి ఈ తరహా ఆదరణ వస్తుండటం తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :