సాహోలో మళ్లీ అలాంటి ఫైట్ ?

27th, May 2017 - 10:38:03 AM


బాహుబలి 2 చిత్ర విడుదల సందర్భంగానే ప్రభాస్ తరువాతి చిత్రం సాహూ టీజర్ ని కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ చిత్రం టీజర్ తోనే అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. ప్రభాస్ ప్రస్తుతం అమెరికాలో హాలిడే ట్రిప్ లో ఉన్నాడు. తిరిగి రాగానే ఈచిత్ర షూటింగ్ లో పాల్గొంటాడు.

ఈ చిత్ర షూటింగ్ కి సంబందించిన వార్త ప్రభాస్ అభిమానులను థ్రిల్ కి గురిచేస్తోంది. ముంబై వీధుల్లో ఓ స్టైలిష్ రైన్ ఫైట్ ని చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. సాహూ చిత్రంలో ఈ ఫైట్ హైలైట్ కానుందని అంటున్నారు.మిర్చి చిత్రం లోని రైన్ ఫైట్ తరహాలోనే దీనిని కూడా చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ముంబై మాఫియా నేపథ్యం గా సాగుతుందని, ప్రభాస్ డాన్ గా కనిపిస్తాడని తెలిసింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రాబోతున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు.కాగా హీరోయిన్ ని ఇంకా ఎంపిక చేయలేదు.