ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న “మిషన్ ఇంపాజిబుల్”..!

Published on Apr 21, 2022 12:21 am IST

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేం స్వ‌రూప్ ఆర్ఎస్‌జె తెరకెక్కించిన చిత్రం “మిషన్ ఇంపాజిబుల్”. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 1న థియేటర్లలో విడుదలై ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. కాగా ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కి సిద్దమయ్యింది.

ఈ క్రైమ్ కామెడీ చిత్రం ఏప్రిల్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. కాగా ఈ చిత్రంలో హర్ష్ రోషన్, భాను ప్రకాశన్, జయతీర్థ మొలుగు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మార్క్ కె రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :