ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ గా “మిషన్ ఇంపాజిబుల్” ట్రైలర్

Published on Mar 15, 2022 10:07 pm IST


తాప్సీ తన కెరీర్‌లో చాలా ఆసక్తికరమైన చిత్రాలను చేస్తోంది, వాటిలో ఒకటి మిషన్ ఇంపాజిబుల్. స్వరూప్ ఆర్‌ఎస్‌జే దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్‌ను ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. పేరుమోసిన క్రిమినల్ అయిన దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడానికి ముగ్గురు పిల్లలు తమ ప్రయాణం ను మొదలు పెడతారు.

ఈ కేసులో ప్రమేయం ఉన్న వ్యక్తిగా తాప్సీ కూడా కనిపిస్తుంది. పరిస్థితులు ఎంతో కఠినంగా ఉన్నప్పటికీ, ట్రైలర్‌లో ఫన్ జనరేట్ చేయడం చాలా బాగుంది. లుక్స్‌ని బట్టి చూస్తే సినిమాలో చాలా ట్విస్ట్‌లు మరియు టర్న్‌లతో సరదాగా సాగుతుంది అని తెలుస్తుంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రంలో హర్ష్ రోషన్, భాను ప్రక్షన్, జయతీర్థ మొలుగు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 1, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :