మరో మైల్ స్టోన్ అందుకున్న “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి”

Published on Sep 17, 2023 8:01 am IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ అనుష్క హీరోయిన్ గా దర్శకుడు మహేష్ బాబు తెరకెక్కించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమే “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి”. మరి సాలిడ్ సక్సెస్ అందుకున్న ఈ చిత్రం అయితే తెలుగు స్టేట్స్ సహా యూఎస్ లో కూడా అదిరే రన్ ని కంటిన్యు చేస్తుండగా యూఎస్ మార్కెట్ లో అయితే ఈ చిత్రం సూపర్ స్ట్రాంగ్ హోల్డ్ తో దూసుకెళ్తుంది.

లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం మరో మైల్ స్టోన్ మార్క్ 1.5 మిలియన్ డాలర్స్ ని రాబట్టినట్టుగా డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్ చేశారు. మరి ఈ హవాలో అయితే ఈ చిత్రం డెఫినెట్ గా 2 మిలియన్ మైల్ స్టోన్ ని కూడా అందుకుంటుంది అని చెప్పొచు. మొత్తానికి అయితే అనుష్క నుంచి మంచి కం బ్యాక్ వచ్చింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అయితే రాధన్ సంగీతం అందించగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :