మిషన్ ఇంపాజిబుల్ ప్రీ రిలీజ్ వేడుకకి చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్..!

Published on Mar 29, 2022 11:44 pm IST

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేం స్వ‌రూప్ ఆర్ఎస్‌జె తెరకెక్కించిన చిత్రం “మిషన్ ఇంపాజిబుల్”. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదల కాబోతుంది. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకని మార్చి 30వ తేదిన నిర్వహించబోతున్నారు.

అయితే ఈ ప్రీ రిలీజ్ వేడుకకి చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్టు మేకర్స్ అధికారంగా తెలిపారు. కాగా సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక ప్రారంభమవుతుందని తెలిపారు కానీ వేదిక గురుంచి మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే హర్ష రోషన్, భాను ప్రకాశన్ మరియు జయ తీర్థ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :