‘మిస్టర్’ సినిమాలో కావలసినన్ని ట్విస్టులు ఉంటాయట !


మెగాహీరో వరుణ్ తేజ్, శ్రీను వైట్ల కలయికలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్’. రేపు ఏప్రిల్ 14 శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే ట్రైలర్, పాటలతో మంచి పాజిటివ్ క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రానికి హీరో హీరోయిన్లు పాల్గొంటున్న ప్రచార కార్యక్రమాలు మరింత ఊపునిస్తున్నాయి. తాజాగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రమోషన్లలో భాగంగా సినిమా గురించిన పలు విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

‘మిస్టర్’ సినిమాలో తన పాత్ర చంద్రముఖి ఎప్పుడూ నవ్వుతూ, సంతోషంగా ఉంటుందని, ఇలాంటి కొత్తదనమున్న క్యారెక్టర్ తానిప్పటి వరకు చేయలేదని, శ్రీను వైట్ల పాత్రను వివరించగానే వేరే ఆలోచన లేకుండా ఓకే చెప్పానని అన్నారు. అలాగే ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో కావాల్సినన్ని ట్విస్టులు దొరుకుతాయని, ఒక్క సన్నివేశం కూడా బోర్ కొట్టదని, ప్రతి ఒక్కరు సినిమాను తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ఆన్నారు. లావణ్యతో పాటు వరుణ్ సరసన హెబా పటేల్ కూడా మరొక హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందివ్వగా ఠాగూర్ మధు, నల్లమలపు బుజ్జిలు నిర్మాతలుగా వ్యవహరించారు.