ఈ నెల 29న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ప్రభుదేవా “మిస్టర్ ప్రేమికుడు”..!

ఈ నెల 29న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ప్రభుదేవా “మిస్టర్ ప్రేమికుడు”..!

Published on Oct 20, 2021 10:06 PM IST


ప్ర‌భుదేవా, అదాశ‌ర్మ‌, నిక్కిగ‌ల్రాని హీరో హీరోయిన్లుగా నటించిన త‌మిళ చిత్రం ‘చార్లీ చాప్లిన్’ ఇటీవ‌ల విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. ఈ చిత్రాన్ని శ్రీ తార‌క‌రామ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎమ్.వి. కృష్ణ స‌మ‌ర్ప‌ణ‌లో వి.శ్రీనివాస‌రావు, గుర్రం మ‌హేష్ చౌద‌రి తెలుగులోకి ‘మిస్ట‌ర్ ప్రేమికుడు’ పేరుతో అనువ‌దించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కాబోతుంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాతలు వి.శ్రీనివాస‌రావు, గుర్రం మ‌హేష్ చౌద‌రి మాట్లాడుతూ ప్ర‌భుదేవా, అదాశ‌ర్మ‌, నిక్కిగ‌ల్రాని న‌టించ‌గా త‌మిళంలో రూపొంది ఘ‌న విజ‌యం సాధించిన ‘చార్లిచాప్లిన్’ చిత్రాన్ని తెలుగులో ‘మిస్ట‌ర్ ప్రేమికుడు’ పేరుతో అనువ‌దిస్తున్నామని, ఇప్ప‌టికే అనువాద కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయని అన్నారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలోని పాట‌లతో పాటు సెకండాఫ్ లో వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని ప్ర‌భుదేవ ప‌ర్ఫార్మెన్స్, డాన్స్ తో పాటు అదాశ‌ర్మ‌, నిక్కిగ‌ల్రాని అందం, అభిన‌యం సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుందని అన్నారు.

అయితే చాలా కాలం త‌ర్వాత ప్ర‌భుదేవ త‌ర‌హా హాస్యంతో పాటు ఆయ‌న డాన్స్ మ‌రోసారి కనువిందు చేయనుందని, ఈ సినిమాను ఈ నెల 29న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నామని, ప్రేక్ష‌కులు మా సినిమాని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నామని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు