స్పెయిన్ నుంచి తిరుగుప్రయాణం కానున్న వరుణ్ తేజ్!

2nd, August 2016 - 05:31:07 PM

mister
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, దర్శకుడు శ్రీనువైట్లల కాంబినేషన్‍లో ‘మిస్టర్’ పేరుతో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్ళిన విషయం తెలిసిందే. గత నెల మొదటి వారంలో స్పెయిన్‌లో ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ను మొదలుపెట్టిన టీమ్, తాజాగా ఈ షెడ్యూల్‌ను దాదాపుగా పూర్తి చేసింది. ఆగష్టు 4వ తేదీన టీమ్ హైద్రాబాద్ తిరుగు ప్రయాణం కానుంది. ‘ఆగడు’, ‘బ్రూస్ లీ’ లాంటి పరాజయాల తర్వాత ఎలాగైనా తన స్థాయి సినిమా తీయాలన్న ఆలోచనతో శ్రీనువైట్ల ఈ ప్రాజెక్టు కోసం చాలా కష్టపడుతూ వస్తున్నారు.

స్పెయిన్ షెడ్యూల్‍లో పలు అందమైన లొకేషన్స్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించిన టీమ్, తిరిగి మంగళూరులో ఈ నెలాఖర్లో మరో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనుంది. నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీనువైట్ల స్టైల్లోనే యాక్షన్ కామెడీగా సినిమా తెరకెక్కుతోందని సమాచారం. ఇక ఈ సినిమాతో పాటు శేఖర్ కమ్ములతోనూ వరుణ్ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే.