ఆర్ఆర్ఆర్ ‘నా పాట సూడు’ సాంగ్‌ పేరిడీ వైరల్ !

Published on Dec 12, 2021 11:27 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. విజువల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో
రానున్న ఈ భారీ చిత్రం పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే, ఈ సినిమాలోని ఓ పాటను రాజకీయ నాయకులు తమ విమర్శలకు ఆయుధంలా వాడుకుంటున్నారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఏపీ ప్రభుత్వ పాలన పై విమర్శలు గుప్పిస్తూ ఆర్ఆర్ఆర్ సినిమాలోని నా పాట సూడు సాంగ్‌ను పేరిడీ చేసి వదిలారు. ‘అప్పులోళ్ళ ఖాతాల్లో వడ్డీ రేట్లు పెరిగినట్టు.. పోలవరం డ్యామ్ కోసం బెట్టింగ్ రాజు ఊగినట్టు.. నోటి బురద మాటలతో గుడివాడలోన ఎగిరినట్టు.. ప్రత్యేక హోదా నీడలోన రాజకీయం చేసినట్టు.. ఎన్నికల హామీలు కొండఎక్కించినట్టు.. నా పాలన సూడు, నా పాలన సూడు, నా పాలన సూడు.. వేస్టు.. వేస్టు.. వేస్టు.. సుద్ద వేస్టు..’ అంటూ బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు.

సంబంధిత సమాచారం :