హీరోయిన్‌ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మంత్రి రోజా కూతురు ?

Published on Aug 21, 2022 12:31 am IST

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్​గా రాణించిన రోజా.. ప్రస్తుతం పాలిటిక్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే రోజా కూతురు ‘అన్షు మాలిక’ తెలుగు తెర పై రంగ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంది అంటూ గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో పుకార్లు వినిపిస్తున్నాయి. అసలు వాస్తవాలు వాస్తవానికి తెలియకముందే, ఈ రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా అన్షుమాలిక సినీ ఎంట్రీ పై మరోసారి వార్తలు వినిపస్తున్నాయి.

రోజా నట వారసత్వాన్ని కొనసాగిస్తూ అన్షుమాలిక త్వరలోనే సినిమాల్లోకి రానుందట. ఓ సినీ వారసుడు నటించనున్న మూవీలో అన్షుమాలిక హీరోయిన్​గా అరంగేట్రం చేయనుందని తెలుస్తోంది. ఇప్పటికే USలో ఫేమస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో అన్షుకు సీటు కూడా వచ్చింది. త్వరలోనే ఆమె అక్కడ చేరనుంది. అక్కడ నుంచి రాగానే వరుసగా సినిమాల్లో నటించడానికి అన్షుమాలిక సన్నద్ధం అవుతుందట.

సంబంధిత సమాచారం :