పండుగకి సందడి చేయనున్న కళ్యాణ్ రామ్

13th, January 2018 - 11:09:43 AM

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మంచి లక్షలున్న అబ్బాయి’ షూటింగ్ దశలో ఉంది. నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం యొక్క టీజర్ రేపు భోగి సందర్బంగా రిలీజ్ కానుంది. ఉదయం 10 గంటల 49 నిముషాలకు ఈ టీజర్ విడుదలవుతుంది.

2007 లో వచ్చిన ‘లక్ష్మీ కళ్యాణం’ తర్వాత కాజల్, కళ్యాణ్ రామ్ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. భారత్ చౌదరి, కిరణ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవికు రిలీజ్ చేయాలనే యోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.