‘ఎం.ఎల్.ఏ’ కళ్యాణ్ రామ్ కు మర్చిపోలేని సినిమా అవుతుందట !

కళ్యాణ్ రామ్ చేస్తున్న చిత్రాల్లో ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’ కూడా ఒకటి. చిత్రీకరణ ఆఖరి దశకు చేరుకున్న ఈ సినిమా టీజర్ ఉదయమే విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. లుక్స్ పరంగా కళ్యాణ్ రామ్ ఇంప్రెస్ చేయగా సినిమాలో ఎంటర్టైన్మెంట్ పాళ్ళు కూడా ఎక్కువగా ఉంటాయని టీజర్ చూస్తే అవగతమవుతోంది. నిర్మాతలు మాట్లాడుతూ ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్లో మర్చిపోలేని చిత్రంగా నిలుస్తుందని అన్నారు.

టాకీ పార్ట్ మొత్తం పూర్తికాగా పాటల చిత్రీకరణ కోసం వచ్చే నెల విదేశాలకు వెళ్లనున్నారు టీమ్. భారత్ చౌదరి, కిరణ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. కళ్యాణ్ రామ్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి నెలలో రిలీజ్ చేయనున్నారు.