నా పాట పంచామృతం కంపోజ్ చేసిన ప్లేస్ అంటూ కీరవాణి పోస్ట్!

Published on Sep 5, 2021 5:00 pm IST

తెలుగు సినీ పరిశ్రమలో ఎంఎం కీరవాణి గారికి చాలా ప్రత్యేకత ఉందని చెప్పాలి. ఎన్నో మధుర గీతాలను తెలుగు సినీ పరిశ్రమ కి అందించారు. అల్లరి మొగుడు చిత్రం లో కీరవాణి స్వర కల్పన లో వచ్చిన నా పాట పంచామృతం ఎవర్ గ్రీన్ హిట్. ఇద్దరు గాయకుల మధ్య జరిగే ఈ పాట. ఇద్దరు కూడా పోటి పడి మరీ పాడే పాట ఇది. అయితే అందుకు సంబంధించిన ఒక విషయాన్ని తాజాగా ఎంఎం కీరవాణి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నా పాట పంచామృతం కంపోజ్ చేసిన ప్లేస్ అంటూ చెప్పుకొచ్చారు. మోహన్ బాబు గారి ఇల్లు అంటూ అందుకు సంబంధించిన ఒక విడియో ను షేర్ చేయడం జరిగింది. ప్లేస్ కూడా తన మొహం లాగానే గుర్తు పట్టలేని విధంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు.

ఎంఎం కీరవాణి పోస్ట్ చేసిన వీడియో పై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఎంఎం కీరవాణి ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :