“హరిహర వీరమల్లు” ఫస్ట్ సింగిల్ పై ఎంఎం కీరవాణి క్లారిటీ!

Published on Feb 2, 2023 10:06 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ కెరీర్ లో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. హరిహర వీరమల్లు చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ పై ఒక క్లారిటీ వచ్చింది.

శాకుంతలం చిత్రం కి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం లోని పాటలు ఇన్నోవేటివ్ గా, మెలోడియస్ గా ఉన్నాయ్ అంటూ ఎంఎం కీరవాణి పేర్కొన్నారు. ఈ మేరకు కంగ్రాట్స్ మణి అంటూ చెప్పుకొచ్చారు. ఎంఎం కీరవాణి చేసిన ట్వీట్ కి పవన్ కళ్యాణ్ అభిమాని హరిహర వీరమల్లు ఫస్ట్ సింగిల్ కోసం వెయిటింగ్ అంటూ రిప్లై ఇవ్వగా, 4 పాటలు ప్రోగ్రెస్ లో ఉన్నాయి అని, ఇందులో ఫస్ట్ సింగిల్ ను డైరక్టర్ క్రిష్ డిసైడ్ చేస్తారు అంటూ చెప్పుకొచ్చారు. ఎంఎం కీరవాణి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :