దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘వారణాసి’ (Varanasi) పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులను 2026 సెప్టెంబర్ నుండి మొదలుపెడతానని ఆయన తెలిపారు. దీంతో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. రాజమౌళి సినిమాలకు కీరవాణి ఇచ్చే మ్యూజిక్ ఎప్పుడూ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్ క్యాస్టింగ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్లో తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. ఇక ఈ చిత్రాన్ని 2026 ఏప్రిల్ 7న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.
