మళ్ళీ ‘అతడు’ ర్యాంపేజ్.. ఇలా బుకింగ్స్ మొదలయ్యాయో లేదో

Athadu

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో చేసిన ఎన్నో క్లాసిక్ హిట్ చిత్రాల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేసిన క్లీన్ ఫ్యామిలీ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం “అతడు” కూడా ఒకటి. బుల్లితెరపై ఎన్నో రికార్డులు ఈ సినిమాకి తెలుగు ఆడియెన్స్ లో ఒక సుస్థిర స్థానం అయితే ఉంది. ఇలా ప్రస్తుతం కొనసాగుతున్న రీరిలీజ్ ట్రెండ్ లో “అతడు” రీరిలీజ్ కి వచ్చి మంచి వసూళ్లు అందుకుంది. కానీ దీని పొటెన్షియల్ కి అది కొంచెం తక్కువే కానీ ఈసారి మళ్ళీ సినిమా రీరిలీజ్ కి వస్తుంది.

మరి ఈ రెండో రీరిలీజ్ లో కూడా ఈ సినిమాకి సాలిడ్ రెస్పాన్స్ నమోదు అవుతుండడం విశేషం. బుక్ మై షోలో ఈ చిత్రానికి ఇలా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయో లేదో అప్పుడే మహేష్ బాబు అభిమానులు ఈ చిత్రాన్ని హవర్లి ట్రెండింగ్ లో పెట్టేసారు. దీనితో ఈ సినిమాకి ఈసారి కూడా మంచి వసూళ్లే నమోదు కానున్నాయని చెప్పాలి. మరి ఈసారి అతడు ఎలాంటి నంబర్స్ నమోదు చేస్తుందో చూడాలి. ఈ సినిమా ఈ ఫిబ్రవరి 28న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version