ఇంటర్వ్యూ : పరుశురామ్ – ‘గీత గోవిందం’ నాకు రైటర్ గా, డైరెక్టర్ గా పునర్జన్మను ప్రసాదించింది !
Published on Aug 28, 2018 5:18 pm IST

విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా పరశురాం దర్శకత్వంలో వచ్చిన్న చిత్రం ‘గీత గోవిందం’. గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు. ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సంధర్బంగా ఈ చిత్ర దర్శకుడు పరుశురామ్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

 
‘గీత గోవిందం’ భారీ విజయం సాధించింది. ఆ సక్సెస్ ను మీరెలా ఎంజాయ్ చేస్తున్నారు ?
ముందుగా, గీత గోవిందం రూపంలో నాకు అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్ గారికి, బన్నివాసుగారికి, అలాగే ఈ సినిమాని ఇంత గొప్పగా అందరించిన ప్రేక్షకదేవుళ్ళందరికీ, సినిమాని బాగా ప్రమోట్ చేసిన మీడియా మిత్రులకు చాలా చాలా థాంక్స్ అండి. ఇక ఈ సినిమా సక్సెస్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే రెండు సంవత్సరాల క్రితం ఒక చిన్న సినిమాగా మొదలైన గీతగోవిందానికి ఇప్పుడు ఓ పెద్ద సినిమాకి వచ్చినంత ఫీడ్ బ్యాక్ వస్తోంది. నేను డైరెక్టర్ అయినా పది సంవత్సరాల తర్వాత, ఆరు సినిమాలు డైరెక్ట్ చేసిన తర్వాత, ఈ ‘గీత గోవిందం’ చిత్రం రైటర్ గా, డైరెక్టర్ గా నాకు పునర్జన్మను ప్రసాదించింది.

 
ఈ చిత్రానికి వచ్చిన రివ్యూస్ పట్ల, కలెక్షన్స్ పట్ల మీరు పూర్తి సంతృప్తికరంగా ఉన్నారా ?
ప్రపంచంలో అన్ని ఏరియాల నుంచి ఈ సినిమాకి చాలా మంచి మంచి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. ఇక సినిమాకి వస్తోన్న కలెక్షన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఇంత పెద్ద సక్సెస్ రావటానికి కారణం నేనొక్కడ్నే కాదండి, నాతో పాటు అరవింద్ గారు, వాసుగారు, విజయ్ దేవరకొండ రష్మిక ఇలా ఇంతమంది కష్టపడితే వచ్చింది ఈ సక్సెస్.

 
ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో క్రిష్ గారు ‘పరుశురామ్ ఎప్పుడో స్టార్ లీగ్ లో చేరాల్సిన డైరెక్టర్ అని మిమ్మల్ని ఉద్దేశించి అన్నారు. మరి ఇప్పుడు గీత గోవిందం వంద కోట్లు కలెక్ట్ చేసింది. ఇక మీరు స్టార్ డైరెక్టర్ అయిపోయానని అనుకుంటున్నారా ?
ఇన్ని కోట్లు కలెక్ట్ చేస్తేనే స్టార్ డైరెక్టర్ అనే కొలమానం ఉంటుందని నేను అనుకోవట్లేదు అండి. క్రిష్ గారు అంటే నాకు ఎప్పటినుంచో దాదాపు పది సంవత్సరాల నుంచి మంచి ఫ్రెండ్. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచీ ఆయన నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. దాని వల్ల నా మీద ఏదో అభిమానం వల్ల ఆయన అలా అని ఉండొచ్చు. నేనేమీ పెద్దగా స్టార్ డైరెక్టర్ అయిపోయాననే టైప్ ఫీలింగ్ అయితే నాకు ఏం లేదండి.

 
అదేంటి ? మీ కెరీర్ లోనే ‘గీత గోవిందం’ భారీ విజయం సాధించింది. మరి మీరు మాములుగా ఎలా తీసుకుంటారు ?
సినిమా రిజల్ట్ పట్ల నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, నిజానికి మేం పడ్డ కష్టానికి ప్రేక్షకులు గాని, ఆ భగవంతుడు గాని మేం అనుకున్నదాని కంటే ఇంకా ఎక్కువే సక్సెస్ ఇచ్చాడు. అందుకు చాలా సంతోషంగా ఉంది.

 
మీ గత సినిమాల కంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇంత పెద్ద సక్సెస్ అవ్వటానికి రీజన్ మీరు ఏమనుకుంటున్నారు ?
సక్సెస్ కి ఈ ఒక్క రీజనే అంటూ ఏమి చెప్పలేమండి. ఈ సినిమా ప్రధానంగా యూత్ ని టార్గెట్ చేశాము ఎక్కువుగా యూత్ ఫుల్ ఎమోషన్స్ పెట్టాము, దాంతో మంచి స్క్రిప్ట్, మంచి ఆర్టిస్ట్ లు కుదిరారు. అలాగే సాంగ్స్ చాలా బాగా వచ్చాయి, గోపిసుందర్ చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు. సాంగ్స్ అన్ని విన్నాక ఎప్పుడు చూద్దామా ఎప్పుడు చూద్దామా అని సినిమా కోసం వెయిట్ చేసేలా చేశాయి సాంగ్స్. ఇక వీటన్నిటికంటే మెయిన్ గా విజయ్ దేవరకొండ క్రేజ్, గీతా ఆర్ట్స్ బ్రాండ్ ఇలా ఈ సినిమా సక్సెస్ కి చాలా రీజన్స్ ఉన్నాయి.

 
పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నప్పుడే ఈ సినిమా రీ షూట్ చేసారని రూమర్స్ వచ్చాయి ?
నిజమేనండి. నిజంగానే రీషూట్ చేయటం జరిగింది. రెండు మూడు సీన్స్ లో అక్కడక్కడ లైటింగ్ ప్రోబ్లమ్స్ వచ్చాయి. ఆ కారణంగా కేవలం ఆ రెండు సీన్స్ ను మాత్రమే రీ షూట్ చేశాము.

 
మీరు ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా రాస్తారని మీకు మంచి పేరు ఉంది. దానికి అనుగుణంగానే మీరు చేసిన సినిమాల్లో ఫ్యామిలీ సినిమాలే బాగా ఆడాయి, ఇక నుంచి మీరు ఫ్యామిలీ టైపు సినిమాలే చేస్తారు అనుకోవచ్చా ?
నాకు అలాంటివే చెయ్యాలని ఉంది. కానీ మన చేతుల్లో ఏమి ఉండదండి. కథ, ఆ కథకు తగ్గ ఆర్టిస్ట్ లు సెట్ అవ్వాలి. అయినా నేను ఫలానా టైప్ సినిమాలే చెయ్యాలి, అలాంటి కథే రాయాలి అని నేనెప్పుడూ స్క్రిప్ట్ రాసుకొనండి. ఆ టైములో నేను ఉన్న మూడ్ ని బట్టి స్క్రిప్ట్ చేస్తాను. అలా చేసిందే ఈ గీత గోవిందం కూడా.

 
మొన్న బన్నివాసుగారు రివీల్ చేశారు. పరుశురామ్ ఒక వ్యక్తికీ దేవుడికి సంబంధించిన కథ చెప్పారనీ.. మీ తర్వాత సినిమా అదే అనుకోవచ్చా ?
ప్రస్తుతం అయితే నేను ఆ సినిమా స్క్రిప్ట్ మీదే వర్క్ చేస్తున్నాను. కథకి మంచి క్యారెక్టరైజేషన్స్ సెట్ అయ్యాయి. మూవీ మొత్తం ఫుల్ ఎంటరైన్మెంట్ తో సాగుతుంది. ఒక మనిషికి దేవుడికి మధ్య సాగే ట్రాక్ ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది.

 
మనిషికి దేవుడికి మధ్య కథ అంటున్నారు. గోపాల గోపాల చిత్రాన్ని పోలి ఉంటుందా ?
లేదండి. గోపాల గోపాల సినిమాకి నేను చేయబోయే సినిమాకి అస్సలు పోలిక లేదు. స్క్రిప్ట్ బాగా వస్తోంది. కొత్తగా ఫుల్ ఎంటర్ టైనింగా ఉంటుంది. వచ్చే ఏడాది ఈ సినిమా ఉంటుంది.

 
మీకు ఇప్పటికే చాలామంది ప్రొడ్యూసర్స్ నుండి అడ్వాన్స్ లు అందాయని తెలుస్తోంది. మరి ఏ ప్రొడ్యూసర్ కి మీ తర్వాత సినిమా చేయబోతున్నారు ?
ఒక పెద్ద సక్సెస్ వచ్చాక ఛాన్స్ లు పెరగటం మాములేకాదండి. ప్రస్తుతానికి అయితే నా తర్వాత సినిమా కూడా గీతా ఆర్ట్స్ లోనే ఉండబోతుంది. అలాగే మైత్రిలో ఓ సినిమా చెయ్యాలి. ఇంకా చెయ్యాల్సిన కొన్ని ఉన్నాయి.

 
ఈ ‘గీత గోవిందం’ సినిమాకి మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏమిటి ?
బెస్ట్ కాంప్లిమెంట్స్ చాలా ఉన్నాయి. కాకపొతే ఒక బెస్ట్ అని చెప్పుకోవాలి. మూవీ రిలీజ్ అయిన రోజే నేను వేరే ఎక్కడో థియేటర్ లో ఉన్నాను. ఆ టైంలో అల్లు అరవింద్ గారి దగ్గర నుండి ఓ మెసేజ్ వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే.. ‘మూవీ సూపర్ డూపర్ హిట్. ఇక నీ లైఫ్ సెటిల్ అయిపోయినట్లే’ అని పెట్టరు. నా వారికీ నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే అరవింద్ గారు పెట్టిన మెసేజే.

  • 22
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook