‘జాతిరత్నాలు’ డైరెక్టర్ తో విక్టరీ వెంకటేష్ !

Published on Sep 21, 2021 1:10 pm IST


“జాతిరత్నాలు” బ్లాక్ బస్టర్ హిట్ తో యంగ్ డైరెక్టర్ అనుదీప్ కి ఫుల్ డిమాండ్ పెరిగింది. టాలీవుడ్ లో అతనికి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి అని ఇప్పటికే చాలా రకాలుగా రూమర్స్ వినిపించాయి. అయితే, తాజాగా అనుదీప్ తర్వాత సినిమా పై మరో రూమర్ వినిపిస్తోంది. విక్టరీ వెంకటేశ్‌తో ఈ ‘జాతిరత్నాలు’ దర్శకుడు సినిమా చేయబోతున్నాడనేది ఆ రూమర్ సారాంశం.

మరి ఈ రూమర్ లో వాస్తవం ఎంత ఉందో తెలియదు గాని, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తోంది. ‘జాతిరత్నాలు’ సినిమాలో కామెడీని బాగా హ్యాండిల్ చేశాడు అనుదీప్. పైగా అతి తక్కువ బడ్జెట్‌ తో భారీ హిట్ ఇచ్చాడు కాబట్టి.. అనుదీప్ తో వెంకటేష్ కూడా సినిమా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక నాగ్ అశ్విన్ నిర్మాణంలోనే ఈ సినిమా రాబోతుందట. అయితే ఈ వార్త పై ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాలేదు.

సంబంధిత సమాచారం :