జై లవ కుశ నైజాం ఏరియా రెండవ రోజు కలెక్షన్స్


జై లవ కుశ చిత్రం తొలిరోజు అద్భుతమైన ఓపెనింగ్స్ ని సాధించింది. అదే జోరు రెండవరోజు కూడా కొనసాగుతోంది. పాజిటివ్ టాక్ తో అన్ని ఏరియాలలో ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం నైజాం ఏరియాలో రెండవ రోజు వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి. రెండవరోజు నైజాంలో జై లవకుశ చిత్రం రూ. 2. 28 కోట్ల ని రాబట్టింది.

ఈ షేర్ లో డిస్ట్రిబ్యూటర్లు 61 లక్షల వరకు జీఎస్టీ చెల్లించ వలసి ఉంటుంది. దీనితో చిత్ర వసూళ్లపై జీఎస్టీ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. వచ్చే వరం మహేష్ బాబు స్పైడర్ చిత్రం విడుదల కానుండడంతో జై లవకుశ చిత్రం వీలైనంత ఎక్కువ వసూళ్లు ఈ వారంలోనే రాబట్టాల్సి ఉంది.