మిస్టర్ నోకియా విడుదల వాయిదా?

మిస్టర్ నోకియా విడుదల వాయిదా?

Published on Feb 12, 2012 5:50 PM IST

మంచు మనోజ్ కుమార్ నటించిన ‘మిస్టర్ నోకియా’ చిత్రం ఫిబ్రవరి 17 న వచ్చే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం చెన్నైలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి నాలుగవ వారం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని గురించి అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. ఈ నెల రానున్న శివరాత్రికి నిప్పు, పూల రంగడు, లవ్ ఫెయిల్యూర్ చిత్రాలతో కలిసి విడులవుతుందని ప్రేక్షకులు భావించారు. ఈ చిత్రానికి అని దర్శకత్వం వహించగా మనోజ్ సరసన కృతి ఖర్భంద మరియు సన ఖాన్ హీరోయిన్స్ గా నటించారు. యువన్ శంకర్ రాజా అందించిన పాటలు ఇప్పటికే యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు