బాలయ్య వసూల్ అక్కడ అదిరిపోతోంది


బాలకృష్ణ తాజాగా నటించిన పైసా వసూల్ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని బాలయ్య అభిమానులు మెచ్చే విధంగా తీర్చిదిద్దారు. బాలకృష్ణ పాత్రని మలచిన విధానం, కొత్త మోడ్యూల్ లో బాలకృష్ణ డైలాగ్ డెలివరీ వంటి అంశాలు ఈ చిత్రానికి ఆకర్షణగా మారాయి. బాలకృష్ణకు మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే పైసా వసూల్ చిత్రం లో బాలకృష్ణ పాత్ర కలిగించిన ఆసక్తితో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనితో రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు మంచి వసూళ్ళని సాధించినట్లు తెలుస్తోంది.

మాకు అందుతున్న సమాచారం ప్రకారం కృష్ణా జిల్లాలో పైసా వసూల్ చిత్ర వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి. తొలిరోజు రూ 52,70,747 షేర్ ని కృష్ణా జిల్లాలో పైసా వసూల్ చిత్రం సాధించింది. మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన ఈ సినిమాలో బాలయ్య వన్ మాన్ షో చేశాడు. రాబోవు రోజుల్లో ఈ చిత్ర వసూళ్లు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.