ఫోటో మూమెంట్..నా గురు మీరే నాన్న – మహేష్

Published on Sep 5, 2021 1:35 pm IST

నేడు సెప్టెంబర్ 5 గురు పూజోత్సవ దినోత్సవం అన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరికీ తల్లితండ్రి తర్వాత గురువే మరో దైవం వారు జన్మనిస్తే వీరు లోక జ్ఞ్యానాన్ని ఇస్తారు అందుకే వారిని స్మరించుకునేందుకు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజుని ప్రత్యేకంగా జరుపుకుంటారు. అయితే గురు అంటే ఒక్క బడిలో పాఠాలు చెప్పేవారే కాకుండా నిజ జీవితంలో మరెంతో మంది కూడా ఉంటారు. మరి తన జీవితంలో తన గురువు దైవం అన్నీ మీరు అని సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి కృష్ణ గారిని ఉద్దేశించి అంటున్నారు.

తన చిన్ననాటి ఫోటో తన తండ్రితో కలిసి ఉన్న ఒక అపురూపమైన ఫొటోగ్రాఫ్ ను షేర్ చేసుకొని తన జీవితంలో కరుణ, క్రమశిక్షణ, వినయం సమయానుగుణంగా బలంగా ఉండటం ఈదుతున్న ప్రతీ రోజు ఎంతో తనకి నేర్పించిన నా తండ్రికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని మహేష్ ఈ టీచర్స్ డే నాడు తెలిపారు. అలాగే తన ఈ జర్నీ లో తోడుగా ఉన్న ప్రతీ ఒక్కరికీ కూడా రుణపడి ఉంటానని మహేష్ అద్భుతమైన పోస్ట్ తో తెలిపారు.

సంబంధిత సమాచారం :