“బిగ్ బాస్ 5” : ఈ కంటెస్టెంట్ క్రేజ్ కూడా తక్కువేం కాదు.!

Published on Nov 7, 2021 5:00 pm IST


తెలుగు స్మాల్ స్క్రీన్ పై అతి పెద్ద రియాలిటీ షో అయినవంటి బిగ్ బాస్ ఇప్పుదు సీజన్ 5 ని కూడా ఇంకొన్ని వారాల్లో పూర్తి చేసుకోనుంది. అయితే ఏ సీజన్లో అయినా కూడా కొన్ని వారాలు గడిచే సరికి మంచి క్యాలిబర్ ఉన్న కంటెస్టెంట్స్ కి స్పెషల్ క్రేజ్ షో వీక్షకుల్లో ఏర్పడుతుంది. వారికి షో లోకి వెళ్ళక ముందు కూడా పెద్దగా క్రేజ్ లేకున్నా వారి గేమ్ వల్ల షోతో మంచి ఆదరణతోనే తిరిగి వస్తుంటారు. అదే బిగ్ బాస్ షో ప్రత్యేకత.

అలాగే ఇప్పుడు సాదాసీదా గానే అడుగుపెట్టినా ఓ ఇద్దరు కంటెస్టెంట్ కి క్రేజ్ బాగా కనిపిస్తుంది. రీసెంట్ లిస్ట్ లో మానస్ జాయిన్ కాగా మొదటి నుంచీ మంచి ఆదరణ పెంచుకుంటూ వెళ్తున్న శ్రీరామ చంద్ర కూడా నెటిజన్స్ సహా షో వీక్షకుల్లో గట్టి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ట్విట్టర్ ఓ అయితే వీ అడ్మైర్ శ్రీరామ్ అంటూ లక్ష కి పైగా ట్వీట్స్ పడడం చిన్న విషయం కూడా కాదు. మరి ఫైనల్ గా ఈ పోటీలో ఎవరు విజేతగా నిలబడతారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More