కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో ఉన్నారు. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడ్డ అజిత్, గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన అధిక్ రవిచంద్రన్, అజిత్ కోసం మరో పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ‘AK64’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంపై తాజాగా ఒక ఆసక్తికర వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సంక్రాంతికి శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న అనిల్ సుంకర, ఇప్పుడు అజిత్‌తో పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. 2026 ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కేవలం ఫ్యాన్స్ కోసం తీస్తే, ఈ ‘AK64’ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని చేయనున్నారట. మరి ఈ కాంబినేషన్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
