ఫస్ట్ లుక్ టీజర్ తో అంచనాలు పెంచిన ‘మోడరన్ లవ్ హైదరాబాద్’

ఫస్ట్ లుక్ టీజర్ తో అంచనాలు పెంచిన ‘మోడరన్ లవ్ హైదరాబాద్’

Published on Jun 25, 2022 7:03 PM IST


ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఓటిటీ మాధ్యమాలలో ఎక్కువగా ప్రేక్షకులు సినిమాలు, వెబ్ సిరీస్ లు వంటివి చూసేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కొన్నాళ్లుగా వెబ్ సిరీస్ ల హవా మరింతగా నడుస్తోంది. దానితో వాటిని తెరకెక్కిస్తున్నవారు కూడా ఆడియన్స్ ని వాటికి చేరువ చేసేలా ఫస్ట్ లుక్ నుండే ఎంతో ఎంగేజింగ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఆ విధంగా ప్రస్తుతం ఆరు రకాల డిఫరెంట్ స్టోరీస్ తో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్, మోడరన్ లవ్ హైదరాబాద్. అభిజీత్ దుద్దాల, ఆదిపినిశెట్టి, రేవతి, నిత్యామీనన్, సుహాసిని, రీతూ వర్మ తదితరులు కీలక పాత్రలు చేసిన మోడరన్ లవ్ హైదరాబాద్ టీజర్ ప్రస్తుతం అందరినీ ఎంతో ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో మంచి వ్యూస్ రాబడుతోంది.

ఆరు జంటల మధ్య సాగె జీవితంలోని ప్రేమ, అనుబంధం, ఆప్యాయత, నమ్మకాల నడుమ సాగనుంది మోడరన్ లవ్ హైదరాబాద్ స్టోరీ. యువ దర్శకులు వెంకటేష్ మహా, నగేష్ కుకునూర్, ఉదయ్ గుర్రాల, దేవిక తదితరులు తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ జులై 8 నుండి ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానుంది. న్యూయార్క్ టైమ్స్ లో ప్రచురించబడ్డ కథనాల యొక్క స్పూర్తితో ఎంతో అద్భుతంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు