విష్ణు సేఫ్ గానే ఉన్నాడన్న మోహన్ బాబు !


ప్రస్తుతం మలేషియాలో జరుగుతున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్న మంచు విష్ణు బైక్ స్టంట్ చేయబోయి ప్రమాదవశాత్తు గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో విష్ణు మెడకు, భుజానికి తీవ్ర గాయాలై ఐసీయూలో చికిత్స పొందుతున్నారని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచారం చేశాయి. దీంతో అందరూ విష్ణుకు ఏమైందోనని కంగారుపడ్డారు.

కానీ 123 తెలుగు. కామ్ ముందుగా తెలిపినట్టే ఈ ప్రమాదంలో విష్ణుకు అయింది చిన్న చిన్న గాయాలేనని, పెద్దగా కంగారుపడవల్సింది ఏమీ లేదని రూఢీ అయింది. కొద్దిసేపటి క్రితమే విష్ణు తండ్రి మోహన్ బాబు, సోదరుడు మనోజ్, సోదరి మంచు లక్ష్మి ట్విట్టర్ ద్వారా దేవుడి దయ వలన, అందరి ఆశీస్సుల వలన విష్ణు చిన్న చిన్న గాయాలతో ప్రమాదం నుండి బయటపడ్డాడని తెలిపారు.