వర్మ కోసం వేషం మారుస్తున్న మోహన్ బాబు

mohan-babu
550కు పైగా సినిమాలలో నటించిన అనుభవం మంచు మోహన్ బాబు సొంతం. విలక్షణ నటుడిగా, డైలాగ్ కింగ్ గా ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్నారు. తన నటనకు ప్రేక్షకులను బానిసలగా చేసుకున్నారు. సుమారు 38 ఏళ్ళ కెరీర్లో ఎందరో అగ్ర దర్శకులతో పనిచేసిన మోహన్ బాబు ఒక దర్శకుడి పనితనం చూసి ఫిదా అయ్యారు. అతడే రామ్ గోపాల్ వర్మ.

రామ్ గోపాల్ వర్మ, మోహన్ బాబు కాంబినేషన్లో వచ్చిన ‘రౌడీ’ విమర్శకుల ప్రసంశలతో పాటు ప్రేక్షకుల ఆదరణ పొందింది. ‘రౌడీ’ షూటింగ్ సమయంలో వర్మ క్రమశిక్షణ, టైం పంక్చ్యువాలిటీ చూసి అతనికి బానిస అయ్యాను. ఇప్పుడతను నా అభిమాన దర్శకుడు. వర్మ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాను అని చెప్పారు మోహన్ బాబు.

మీతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాను. మీరు గుండు చేయించుకోండి అని వర్మ చెప్పడంతో నా లుక్ మార్చాను. ఎటువంటి క్యారెక్టర్ లో నన్ను చూపిస్తాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. త్వరలో ఈ సినిమా వివరాలు వెల్లడిస్తాను అని మోహన్ బాబు తెలిపారు.

Exit mobile version