మోహన్ బాబు, లక్ష్మి ప్రసన్న ల ‘అగ్ని నక్షత్రం’ గ్లింప్స్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Feb 11, 2023 11:28 pm IST


మంచు ఎంటర్టైన్మెంట్స్, శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ సంస్థలపై ఎంతో భారీ స్థాయిలో నిర్మితం అవుతోన్న లేటెస్ట్ మూవీ అగ్ని నక్షత్రం. వంశీ కృష్ణ మళ్ళ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి అచ్చు రాజమణి సంగీతం అందిస్తుండగా గోకుల్ భారతి కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తున్నారు. తొలిసారిగా మోహన్ బాబు, లక్ష్మి ప్రసన్న కలిసి నటిస్తున్న ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుండగా ఇందులో ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయని అంటోంది యూనిట్.

ఇక ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఫిబ్రవరి 14 న ఉదయం 11 గం. 7 ని. లకు మూవీ యొక్క గ్లింప్స్ టీజర్ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. కాగా ఈ గ్లింప్స్ టీజర్ ని యువ నటుడు రానా దగ్గుబాటి రిలీజ్ చేయనుండగా మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి వీలైనంత త్వరలో ప్రేక్షకాభిమానుల ముందుకి తీసుకువచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. కాగా ఈ మూవీలో చిత్ర శుక్లా, సిద్ధిక్, విస్వంత్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం :