‘మంచు ఫ్యామిలీ’లో ఏం జరుగుతోంది ?

‘మంచు ఫ్యామిలీ’లో ఏం జరుగుతోంది ?

Published on Dec 9, 2024 12:59 PM IST

‘మంచు మనోజ్’ గాయాలతో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో, మంచు మోహ‌న్ బాబు కుటుంబం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. అయితే.. మంచు ఫ్యామిలిలో అసలేం జరుగుతుంది ?, నిజంగానే మోహన్ బాబు కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయా ?, శనివారం రాత్రి ఏం జరిగింది ? అంటూ నెటిజన్లను పోస్ట్ లు పెడుతున్నారు. అయితే, ఆస్తుల పంపకం విషయంలోనే అసలు సమస్య ప్రారంభమైందని టాక్.

ఇప్పటికే, మోహన్ బాబు తన ఆస్తులు పంచేశారట. ఐతే, మోహన్ బాబు ఫ్యామిలీకి ఎక్కువగా ఆదాయం తెచ్చి పెట్టేది విద్యా సంస్థలు. ఆ విద్యా సంస్థలలో మనోజ్ కోరుకున్నట్లు అతనికి వాటా రాలేదని, వాటిలో తన హక్కు కోసం మనోజ్ పోరాడుతున్నారని.. ఈ క్రమంలోనే శనివారం రాత్రి మోహన్ బాబు – మనోజ్ మధ్య మాట మాట పెరిగిందని టాక్ నడుస్తోంది. మరి చివరకు ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు